Next Story
Newszop

AP: వాడవాడలో జోరుగా కూటమి ప్రచారం

Send Push

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. ఎన్నికలకు ఇక పదిరోజులే సమయం ఉండటంతో అధికార, విపక్ష పార్టీల అభ్యర్థులతో పాటు వారి కుటుంబసభ్యులూ, సినీ నటులు ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు. ఇంటింటికీ వెళ్లి మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరికలు కొనసాగుతున్నాయి పెనమలూరు నియోజకవర్గం కానూరులో టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. అవనిగడ్డలో మండలి బుద్ధ ప్రసాద్ కుమారుడు, కోడలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుడ్లవల్లేరు మండలంలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము రోడ్ షో నిర్వహించారు. మైలవరంలో టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ సతీమణి శిరీష ప్రచారం చేశారు. పెనుగంచిప్రోలు మండలం కొనకంచిలో టీడీపీ అభ్యర్థి శ్రీరాం తాతయ్య రోడ్ షో నిర్వహించి సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. కంచికర్ల మండలంలో తంగిరాల సౌమ్య ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. విజయవాడలో గద్దె రామ్మోహన్, రణదీర్ నగర్ కరకట్టలో ఆయన భార్య అనురాధ ఇంటింటికీ వెళ్లి.. సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

image


గుంటూరు జిల్లా బేతపూడిలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్కుమార్ సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. కొలకలూరులో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రోడ్ షో చేపట్టారు. అనంతరం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు.తెనాలిలో రజకుల సంఘం నేతలు ఆత్మీయ సమావేశంలో నాదెండ్ల్ మనోహర్తో కలిసి పాల్గొన్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే.. జగన్ను ఓడించాలని పిలుపునిచ్చారు. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో లోకేష్కు మద్దతుగా..ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఇంటింటా ప్రచారం చేపట్టారు. పల్నాడు జిల్లా గురజాల మండలం లో లావు శ్రీకృష్ణదేవరాయలు భార్య మేఘన, యరపతినేని శ్రీనివాసరావు సతీమణి నాగమణి ప్రచారంలో పాల్గొన్నారు. పెద్దగార్లపాడులో యరపతినేని యువతతో కలిసి రోడ్ షో నిర్వహించారు. బాపట్ల జిల్లా చినగంజాం మండలంలో ఏలూరి సాంబశివరావు ఎన్నికల ప్రచారం చేశారు. చీరాల 21వ వార్డులో తెలుగుదేశం అభ్యర్థి కొండయ్య తనయుడు మహంద్ర నాథ్, సినీ నటుడు నిఖిల్ ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.

image


శ్రీకాకుళం జిల్లా జి. సిగడాం మండలంలో బీజేపీ అభ్యర్థి ఈశ్వరరావు రోడ్ షో చేపట్టారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని వైసీపీకి చెందిన 50 కుటుంబాలు భాజపాలో చేరాయి. శ్రీకాకుళంలో టీడీపీ అభ్యర్థి గొండు శంకర్, ఆమదాలవలసలో కూన రవికుమార్ ఇంటింటికీ వెళ్లి.. సూపర్ సిక్స్ పథకాలు వివరించారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పంతం నానాజీ ప్రచారం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి గూడూరు ఉమా బాల, ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి భారీ ర్యాలీ నిర్వహించారు. తణుకు మండలంలో టీడీపీ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ, ఇరగవరంలో ఆయన భార్య ప్రచారం చేశారు. ఉండిలో అభ్యర్థి వేటుకూరి శివరామరాజు ఆవు పాలు తీసి స్థానికులను ఆకట్టుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు, ఉండ్రాజవరం మండలాల్లో జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ రోడ్ షో నిర్వహించగా..ప్రచారంలో సినీ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ పాల్గొన్నారు. నిడదవోలులో ముస్లిం మైనారిటీలు వైసీపీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ద్వారకా తిరుమల మండలంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చింతలపూడిలో టీడీపీ అభ్యర్థి సొంగా రోషన్కు మద్దతుగా. వంగవీటి రాధా రోడ్ షో చేశారు.

Loving Newspoint? Download the app now